బిహార్ ప్రభుత్వానికి పట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. గత ఏడాది నంబర్‌లో బిహార్ సర్కారు కుల గణన నివేదికను అసెంబ్లీ ప్రవేశపెట్టింది. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచుతూ నితీశ్ కుమార్ ప్రభుత్వం సవరణ బిల్లును తీసుకువచ్చింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65శాతానికి పెంచుతూ నితీశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు గురువారం కొట్టివేసింది.
రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బిహార్‌లో రిజర్వేషన్లు 75శాతానికి చేరాయి. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత గెజిట్ సైతం విడుదలైంది. దీంతో రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి చేరాయి.
ఆర్థికంగా వెనకబడినవారికి మరో 10శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లు మొత్తం కలిపి 75శాతానికి పెరిగాయి. ఎస్సీల రిజర్వేషన్ 16 నుంచి 20 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్ రెండు శాతానికి, ఓబీసీ, ఈ-బీసీల రిజర్వేషన్లు 30శాతం నుంచి 43శాతానికి చేరాయి. రిజర్వేషన్ల పెంపుపై గౌరవ్‌కుమార్‌తో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై ప్రభుత్వం, పిటిషన్ల వాదనలను విన్న కోర్టు.. మార్చిలో తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు పాట్నా హైకోర్టు రిజర్వేషన్లను రద్దు చేస్తూ తుది తీర్పును వెలువరించింది.
