కూకట్పల్లి, వెలుగు: కుటుంబ కలహాలతో ఆత్మహత్యా యత్నం చేసిన మహిళను పోలీసులు సకాలంలో స్పందించి రక్షించారు. కాలనీలోని డీమార్ట్ రోడ్డులో అన్నపూర్ణ(37) ఇద్దరు కూతుర్లతో నివసిస్తోంది. ఈమె కొబ్బరి బోండాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోంది.
కుటుంబ కలహాలు గురువారం అర్ధరాత్రి తమ ఇంటి సమీపంలోని ఒక చెట్టుకు తాడుతో ఉరి వేసుకోవటానికి యత్నించి, సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను రక్షించారు.
