తాండూరు, వెలుగు: తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్గా మాజీ డీపీసీ సభ్యుడు పట్లోళ్ల నర్సింహులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రస్తుత చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో, ఆ ఖాళీ స్థానంలో నర్సింహులును ప్రభుత్వం నియమించింది. తన నియామకానికి సహకరించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
