పరీక్ష రాసిన పవిత్ర.. నరేష్ గ్రేట్ అంటూ కామెంట్స్

పరీక్ష రాసిన పవిత్ర.. నరేష్ గ్రేట్ అంటూ కామెంట్స్

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బాగా ట్రెండ్ అయినా జంట ఎవరంటే అది నరేష్ – పవిత్ర లోకేష్(Naresh-pavitra lokesh) అనే చెప్పాలి. తాజాగా ఈ జంట మళ్ళీపెళ్లి(Malli Pelli) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అంతగా ఆడకపోయినా సినిమాని మాత్రం బాగా ప్రమోట్ చేశారు నరేష్. ఈ సినిమాను ఫుల్లుగా ట్రోల్ చేశారు నెటిజన్లు. అయితే మున్నటివరకు ఈ జంటని ట్రోల్ చేసిన నెటిజన్స్.. ఒక్క విషయంలో మాత్రం అభినందిస్తున్నారు. 

ఎందుకంటే, పవిత్ర లోకేష్ ఇప్పుటికీ చదువుకుంటుందట. ఇప్పటికే PG పూర్తి చేసిన పవిత్రకు.. తన మాతృభాష కన్నడలో PhD చేయాలని ఎప్పట్నుంచో కోరిక ఉండేదట. దీనికి నరేష్ కూడా ఒప్పుకోవడంతో తాజాగా పవిత్ర లోకేష్ కర్ణాటకలోని బళ్లారిలో PhD ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. ఈ ఎగ్జామ్ పూర్తయ్యేవరకు నరేష్ పరీక్ష కేంద్రం బయటే వెయిట్ చేశారట. 

ఈ వార్త కన్నడ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో, ఈ వయసులో చదువుకుంటున్నందుకు పవిత్రను, ఆమెకు సపోర్ట్ చేస్తున్నందుకు నరేష్ ను పలువురు అభినందిస్తున్నారు. నరేష్ గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక గత కొంత కాలంగా సహజీవనంలో ఉంటున్న ఈ జంట.. త్వరలోనే పెళ్లితో ఒకటి కానున్నారు.