తెలంగాణ జనసేన నేతలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్

తెలంగాణ జనసేన నేతలతో  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  మీటింగ్
  • మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై చర్చ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జనసేన నేతలతో ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేసేందుకు తెలంగాణ జనసేన నేతలతో పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం భేటీ అయ్యారు. 

ఈ మీటింగులో పార్టీ నేతలు మహేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి, శంకర్ గౌడ్, సాగర్, రాజలింగం పాల్గొన్నారు. శుక్రవారం ప్రచార షెడ్యూల్ రిలీజ్ చేస్తామని తెలంగాణ నేతలు చెబుతున్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు,  కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,  బండి సంజయ్ ఇతర ఎంపీలతో చర్చించి పవన్ ప్రచారంపై షెడ్యూల్ రెడీ చేస్తున్నామని వివరించారు.