ఉస్తాద్ అప్డేట్.. ఆ ఒక్కరోజు పవన్ సినిమాకు బ్రేక్.. కారణం?

ఉస్తాద్ అప్డేట్.. ఆ ఒక్కరోజు పవన్ సినిమాకు బ్రేక్.. కారణం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ప్రస్తుతం వరుస షూటింగ్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మరోపక్క రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలోపు కమిట్ అయినా సినిమాలన్నీ కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొన్నటివరకు సుజీత్(Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఓజీ(OG) షూటింగ్ పాల్గొన్న పవన్.. ప్రస్తుతం హరీష్ శంకర్(Harish shankar) తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagathsingh) షూటింగ్ లో పాల్గొంటున్నారు. 

ALSO READ : హైదరాబాద్ దుర్గం చెరువులో మ్యూజికల్ ఫౌంటేయిన్స్

అయితే తాజా సంచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ ఒకరోజు బ్రేక్ ఇవ్వనున్నారట. దాదాపు వారం రోజులు జరగనున్న ఈ షెడ్యూల్ లో అక్టోబర్ 1న మాత్రం బ్రేక్ ఇవ్వనున్నాడట. దానికి కారణం ఆ రోజు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పాల్గొననున్నారు. ఆ ఒక్కరోజు మినహాయించి త్వరగా ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసి ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నాడట హరీష్ శంకర్. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఉస్తాద్ నుండి పవర్ ఫుల్ ఫోటోను రిలీజ్ చేసిన హరీష్.. ఈ కొత్త షెడ్యూల్ కంప్లీట్ అయినా తరువాత అలాంటి మరో పోస్టర్ రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. ఈ న్యూస్ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.