కొత్తగా పేటీఎం ఇన్సూరెన్స్‌ కంపెనీ

కొత్తగా పేటీఎం ఇన్సూరెన్స్‌ కంపెనీ

న్యూఢిల్లీ: జాయింట్ వెంచర్ విధానంలో  జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేస్తామని పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్‌‌‌‌) ప్రకటించింది.  పేటీఎం ఎండీ విజయ్ శేఖర్ శర్మకు చెందిన వీఎస్‌‌ఎస్‌‌ హోల్డింగ్‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌, వన్‌‌97 కమ్యూనికేషన్స్ కలిసి పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్‌‌ను (పీజీఐఎల్‌‌) ఏర్పాటు చేయనున్నాయి. ఈ జాయింట్ వెంచర్‌‌‌‌ కోసం వచ్చే 10 ఏళ్లలో రూ. 950 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని పేటీఎం ప్రకటించింది. కాగా, కొత్తగా ఏర్పడే జాయింట్ వెంచర్‌‌‌‌లో వన్‌‌97 కమ్యూనికేషన్స్‌‌కు 49 %  వాటా ఉంటుంది. వీఎస్‌‌ఎస్‌‌ హోల్డింగ్‌‌కు 51% వాటా దక్కుతుంది.  భవిష్యత్‌‌లో ఈ జాయింట్ వెంచర్‌‌‌‌లో తమ వాటా 74 శాతానికి పెరుగుతుందని, వీఎస్‌‌ఎస్ హోల్డింగ్ వాటా 26 శాతానికి తగ్గుతుందని పేటీఎం ప్రకటించింది. 

 మళ్లీ విజయ్ శేఖర్ శర్మనే..

పేటీఎం ఎండీ అండ్ సీఈఓగా కంపెనీ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ  మరోసారి నియమితులయ్యారు. ఆయనీ పదవిలో ఇంకో ఐదేళ్ల పాటు పనిచేస్తారు. పేటీఎంకు మార్చి క్వార్టర్‌‌లో రూ. 761.4 కోట్ల నష్టం వచ్చింది.  రూ. 1,541 కోట్ల రెవెన్యూ వచ్చింది.