సన్‌‌ రైజర్స్‌‌ ఓటమి..నాలుగు విజయాల తర్వాత ఓటమి  

సన్‌‌ రైజర్స్‌‌ ఓటమి..నాలుగు విజయాల తర్వాత ఓటమి  
  • హైదరాబాద్‌‌‌‌పై ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ రివెంజ్‌‌‌‌
  • 35 రన్స్‌‌‌‌ తేడాతో గెలుపు   రాణించిన కోహ్లీ, పటీదార్‌‌‌‌‌‌‌‌, బౌలర్లు

వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్‌‌ రైజర్స్‌‌ జోరుకు బ్రేక్‌‌ పడింది. ఉప్పల్‌‌లో  గురువారం జరిగిన మ్యాచ్‌‌లో 35 రన్స్‌‌ తేడాతో బెంగళూరుపై ఓడిపోయింది. బెంగళూరు 20 ఓవర్లలో 206 స్కోరు చేయగా,  హైదరాబాద్‌‌  171 మాత్రమే చేసింది.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రికార్డు స్కోర్లతో దంచికొడుతూ.. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ.. వరుస విజయాలతో  దూసుకెళ్తున్న సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ జోరుకు బ్రేక్‌‌‌‌ పడింది.  సొంతగడ్డపై ఈ సీజన్‌‌‌‌లో  తొలి ఓటమి ఎదుర్కొన్నది. గత మ్యాచ్‌‌‌‌లో తమపై రికార్డు స్కోరు కొట్టిన రైజర్స్‌‌‌‌పై రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు రివెంజ్‌‌‌‌ తీర్చుకుంది. సూపర్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో పాటు బౌలింగ్‌‌‌‌లోనూ మెప్పించిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ... ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో  గురువారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో  35 రన్స్‌‌‌‌ తేడాతో  హైదరాబాద్‌‌‌‌ను చిత్తు చేసింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది.  

తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 206/7 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (43 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 51), రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌‌‌‌‌ (20 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50) ఫిఫ్టీలతో రాణించారు. ఛేజింగ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ 20 ఓవర్లలో 171/8   మాత్రమే చేసి ఓడింది.  షాబాజ్ అహ్మద్‌‌‌‌ ( 37 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 1 సిక్స్‌‌‌‌తో 40 నాటౌట్‌‌‌‌) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. అతనితో పాటు కెప్టెన్‌‌‌‌ కమిన్స్‌‌‌‌ (15 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 3 సిక్సర్లతో31), అభిషేక్ శర్మ (13 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31) తప్ప మిగతా వాళ్లు నిరాశ పరిచారు. ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ బౌలర్లలో  గ్రీన్‌‌‌‌, స్వప్నిల్ సింగ్‌‌‌‌, కర్ణ్‌‌‌‌ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు.    రజత్​ పటీదార్​కు ప్లేయర్ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

హైదరాబాద్‌‌‌‌ ఢమాల్‌‌‌‌

వరుసగా నాలుగు విజయాలు సాధించి, గత మ్యాచ్‌‌‌‌ల్లో ఫస్ట్ బ్యాటింగ్‌‌‌‌ చేసి భారీ స్కోర్లు కొట్టిన సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ ఈసారి ఛేజింగ్‌‌‌‌లో చేతులెత్తేసింది. ఫుల్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్‌‌‌‌‌‌‌‌ ట్రావిస్ హెడ్ (1)ను ఇన్నింగ్స్‌‌‌‌ ఆరో బాల్‌‌‌‌కే ఔట్‌‌‌‌ చేసిన జాక్స్‌‌‌‌ రైజర్స్‌‌‌‌కు షాకిచ్చాడు. మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ అభిషేక్‌‌‌‌ శర్మ జాక్స్ వేసిన మూడో ఓవర్లో 4,6,6తో అలరించాడు. కానీ, యష్‌‌‌‌ దయాల్ వేసిన తర్వాతి ఓవర్లో కీపర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో ఓవర్లో ఐడెన్‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ (7), హార్డ్‌‌‌‌ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్‌‌‌‌ (7)ను ఔట్‌‌‌‌ చేసిన స్వప్నిల్‌‌‌‌ సింగ్ రైజర్స్‌‌‌‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.

తెలుగు కుర్రాడు నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి (13) కూడా నిరాశపరిచాడు. కర్ణ్‌‌‌‌ శర్మ బౌలింగ్‌‌‌‌లో రివర్స్‌‌‌‌ స్వీప్‌‌‌‌ షాట్‌‌‌‌కు ట్రై చేసి బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ (10)ను కర్ణ్‌‌‌‌ శర్మ రిటర్న్‌‌‌‌ క్యాచ్‌‌‌‌తో ఆరో వికెట్‌‌‌‌గా పెవిలియన్‌‌‌‌ చేర్చడంతో రైజర్‌‌‌‌‌‌‌‌ 86/6తో డీలా పడింది.  ఈ దశలో కెప్టెన్‌‌‌‌ కమిన్స్‌‌‌‌ కాసేపు పోరాడే ప్రయత్నం చేశాడు. స్వప్నిల్ బౌలింగ్‌‌‌‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన అతను కర్ణ్‌‌‌‌ శర్మ ఓవర్లో  4,6 రాబట్టాడు. కానీ, గ్రీన్‌‌‌‌ వేసిన 14వ ఓవర్లో సిరాజ్‌‌‌‌ పట్టిన చురుకైన క్యాచ్‌‌‌‌కు కమిన్స్‌‌‌‌ వెనుదిరగడంతో రైజర్స్‌‌‌‌ ఓటమి ఖాయమైంది. రెండు ఫోర్లు కొట్టిన భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ (13)ను కూడా గ్రీన్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేశాడు. ఉనాద్కట్‌‌‌‌ (8 నాటౌట్‌‌‌‌)కు తోడుగా షాబాజ్ అహ్మద్‌‌‌‌ చివరిదాకా పోరాడినా ఓటమి అంతరం మాత్రమే తగ్గింది.

కోహ్లీ, పటీదార్‌‌‌‌‌‌‌‌ ఫిఫ్టీలు


టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ.. కోహ్లీ, రజత్ పటీదార్‌‌‌‌‌‌‌‌ మెరుపులతో 200 ప్లస్‌‌‌‌ స్కోరు చేసింది. తొలుత కెప్టెన్‌‌‌‌ ఫా డుప్లెసిస్ (25)తో కలిసి తొలి వికెట్‌‌‌‌కు 48 రన్స్‌‌‌‌ జోడించి విరాట్‌‌‌‌ మంచి పునాది వేశాడు.  ఎదుర్కొన్న తొలి బాల్‌‌‌‌నే కోహ్లీ బౌండ్రీకి తరలించగా, భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ వేసిన రెండో ఓవర్లో డుప్లెసిస్‌‌‌‌ మూడు ఫోర్లతో అలరించాడు. కమిన్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో  కోహ్లీ రెండు ఫోర్లు కొట్టగా, డుప్లెసిస్‌‌‌‌ సిక్స్‌‌‌‌ బాదాడు. కానీ, నటరాజ్‌‌‌‌ వేసిన నాలుగో ఓవర్లో మరో షాట్‌‌‌‌కు ట్రై చేసిన డుప్లెసిస్‌‌‌‌.. మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌కు తొలి బ్రేక్‌‌‌‌ లభించింది.

ఐదో ఓవర్లో షాబాజ్ రెండే రన్స్‌‌‌‌ ఇచ్చినా.. నట్టూ బౌలింగ్‌‌‌‌లో కోహ్లీ సిక్స్‌‌‌‌ రాబట్టడంతో  పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేను ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ 61/1తో ముగించింది. ఏడో ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ మయాంక్‌‌‌‌ మార్కండే.. స్లో బాల్‌‌‌‌తో విల్‌‌‌‌ జాక్స్‌‌‌‌ (6)ను బౌల్డ్ చేశాడు. నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌‌‌‌‌.. కోహ్లీకి తోడుగా దూకుడుగా బ్యాటింగ్‌‌‌‌ చేశాడు. వచ్చీరాగానే ఫోర్‌‌‌‌‌‌‌‌, సిక్స్‌‌‌‌ కొట్టిన అతను  మార్కండే వేసిన 11వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లతో చెలరేగాడు. 19 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతడిని 13వ ఓవర్లో ఉనాద్కట్ పెవిలియన్‌‌‌‌ చేర్చడంతో మూడో  వికెట్‌‌‌‌కు 65  రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయింది.

ఈ దశలో సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ బౌలర్లు పుంజుకోవడంతో  వరుసగా నాలుగు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ రన్‌‌‌‌రేట్ తగ్గింది. 37బాల్స్‌‌‌‌లో  ఫిఫ్టీ దాటిన విరాట్‌‌‌‌ ఒత్తిడికి గురై ఉనాద్కట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చి వెనుదిరగ్గా 15 ఓవర్లకు ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ 142/4 స్కోరుతో నిలిచింది. కమిన్స్‌‌‌‌ వేసిన తర్వాతి ఓవర్లో  గ్రీన్‌‌‌‌ (37) రెండు ఫోర్లు, మహిపాల్‌‌‌‌ లోమ్రోర్‌‌‌‌‌‌‌‌ (7) ఒక ఫోర్ కొట్టి స్కోరు బోర్డులో మళ్లీ కదలిక తెచ్చారు.  కానీ, తర్వాతి ఓవర్లోనే ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ వైడ్‌‌‌‌ బాల్‌‌‌‌తో లోమ్రోర్‌‌‌‌‌‌‌‌ను ఉనాద్కట్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేశాడు. కమిన్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో గ్రీన్‌‌‌‌ రెండు ఫోర్లు కొట్టగా.. ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌ రాబట్టిన కార్తీక్ (11) సమద్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంపాక్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన  స్వప్నిల్ సింగ్‌‌‌‌ (12)  నట్టూ వేసిన చివరి ఓవర్లో 6,4తో స్కోరు 200 దాటించి ఆఖరి బాల్‌‌‌‌కు ఔటయ్యాడు.

ఐపీఎల్‌‌‌‌ పది సీజన్లలో 400లకు పైగా స్కోర్లు చేసిన ఏకైక ప్లేయర్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ. 2011, 2013, 2015, 2016, 2018, 2019, 2020, 2021, 2023లోనూ కోహ్లీ నాలుగొందలు దాటాడు. ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌‌‌‌లు ఆడిన అతను 430 రన్స్‌‌‌‌ చేశాడు.

సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 206/7 (కోహ్లీ 51, పటీదార్‌‌‌‌‌‌‌‌ 50, ఉనాద్కట్‌‌‌‌ 3/30, నటరాజన్‌‌‌‌ 2/39).

హైదరాబాద్‌‌‌‌: 20 ఓవర్లలో 171/8 (షాబాజ్‌‌‌‌ 40*, అభిషేక్‌‌‌‌ 31,కామెరూన్​ గ్రీన్‌‌‌‌ 2/12)