మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఎన్నికల తర్వాత రీఛార్జ్ రేట్లు పెరుగనున్నాయా?

మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఎన్నికల తర్వాత రీఛార్జ్ రేట్లు పెరుగనున్నాయా?

ఈరోజుల్లో మొబైల్ ఫోన్ వాడని వారులేరు. మొబైల్ ఫోన్లు పనిచేయాలంటే రీచార్జ్ తప్పనిసరి. దేశవ్యాప్తంగా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు అనేక రకలా రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్..త్వరలో  అన్నిరకాల నెట్ వర్కల్ రీచార్జ్ ప్లాన్ల రేట్లు పెరగనున్నాయి.  ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటి మొబైల్ నెట్ వర్క్ కంపెనీలు ఇప్పటికే రేట్ల పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. 

లోక్ సభ ఎన్నికల తర్వాత మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు టారిఫ్ లను పెంచేందుకు సిద్దమవుతున్నాయి. ఇకపై రీఛార్జ్ చేయడం అనేది కూడా మరింత ఖరీదైనదిగా మార నుంది. కంపెనీలు ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్ల రేటు పెంచడంపై ప్రణాళికలు రూపొందించాయి. 

యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలు 15 నుంచి 17 శాతం పెంచే అవకాశం ఉంది. టెలికా కంపెనీలు ఈ తారిఫ్ పెంచేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల తర్వాత రీచార్జ్ ప్లాన్ల రేట్లు పెంచుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ టెలికం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా పెంచే అవకాశం ఉందంటున్నారు. 

టెలికం కంపెనీలు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ రీచార్జ్ ప్లాన్ల రేట్లు పెంచుతోంది. డిసెంబర్ 2021లో చివరి సాగారిగా రీచార్జ్ ప్లాన్ రేట్లను 20 శాతం పెంచాయి.గత మూడేళ్లలో ఇది మొదటి పెరుగుదల.