సైబర్ సెక్యూరిటీపై అసోచామ్ కాన్ఫరెన్స్

సైబర్ సెక్యూరిటీపై అసోచామ్ కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు:  సైబర్ సెక్యూరిటీ - సవాళ్లు,  అవకాశాల’పై  అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్)  బుధవారం నిర్వహించింది.   పెరుగుతున్న నేరాల గురించి అవగాహన కల్పించడానికే ఈ ప్రయత్నమని సంస్థ తెలిపింది. సీఐడీ అడిషనల్ డైరెక్టర్ శిఖా గోయల్​ మాట్లాడుతూ ‘‘  సైబర్ నేరాలపై ప్రజలకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. 

సైబర్ క్రైమ్స్​ కారణంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా 10.50 ట్రిలియన్ల నష్టం జరుగుతుందని అంచనా. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియాపై ప్రభావం ఉంటుంది” అని అన్నారు. రాష్ట్ర ఐటీ విభాగం  ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్, ఓఎస్​డీ రమాదేవి మాట్లాడుతూ,  సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ రంగంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఎమర్జింగ్​ టెక్నాలజీలను స్వీకరించాలని సూచించారు. ఐఐటీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ముప్పు తగ్గించడానికి   చేపడుతున్న చర్యలను వివరించింది.