పీసీసీ చీఫ్పై కావాలనే దుష్ప్రచారాలు.. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ధ్వజం

పీసీసీ చీఫ్పై కావాలనే దుష్ప్రచారాలు.. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ధ్వజం

బషీర్​బాగ్, వెలుగు: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్​పై ఓ చానల్ చేస్తున్న దుష్ప్రచారాల పట్ల బీసీ పొలిటికల్ ఫ్రంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా అణిచివేసే కుట్రలో భాగంగానే ఇటువంటి కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

మహేశ్​కుమార్ గౌడ్​ను పదవి నుంచి తొలగించి అగ్రవర్ణాలకు కట్టబెట్టాలనే కుట్ర దీని వెనుక దాగి ఉందని ఆరోపించారు. మహేవ్ కుమార్ టీపీసీసీ చీఫ్ అయ్యాకే సర్పంచ్, మున్సిపల్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందని, పైగా ఆయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం తన సొంత 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని గుర్తుచేశారు. ఈ దుష్ప్రచారాలపై సదరు చానల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చానల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఫ్రంట్ కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, శేఖర్, దుర్గయ్య గౌడ్, నారాయణ తదితరులు హెచ్చరించారు.