కాంగ్రెస్కమిటీలను నియమించండి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కాంగ్రెస్కమిటీలను నియమించండి :  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •   జనగామ, తుంగతుర్తి నేతలకు పీసీసీ చీఫ్ సూచన

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను నియమించాలని పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్ సూచించారు. శుక్రవారం గాంధీ భవన్ లో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్​నేతలతో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ కొన్ని జిల్లాల పార్టీ కార్యవర్గాల జాబితా పీసీసీకి అందలేదన్నారు. 

కమిటీల నియామకాలను వెంటనే పూర్తి చేసి, జనంలోకి వెళ్లాలని చెప్పారు. స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. పాత, కొత్త నాయకులను కలుపుకొని పోవాలని, సమన్వయంతో బూత్​స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని పేర్కొన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య,  ఎమ్మెల్యే మందుల సామేల్, డీసీసీ అధ్యక్షురాళ్లు ధన్వంతి, ఆంక్షా రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.