కేసీఆర్ రాజు కాదు.. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్

కేసీఆర్ రాజు కాదు.. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ( ఫిబ్రవరి 1 ) సిట్ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ విచారణపై మీడియాతో మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ ఏమీ రాజు కాదని.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సాధారణంగానే జరుగుతోందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పుడు ఏజ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.

సినీ తారల ఫోన్లు ట్యాప్ చేసి.. బ్లాక్ మెయిల్ చేశారని.. వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేశారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసమే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని.. నోటీసులిస్తే, విచారణకు వస్తే సరిపోతుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఇరుక్కుపోయారని.. తప్పు చేస్తే జైలుకు పోక తప్పదని చరిత్ర చెబుతోందని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.

బీఆర్ఎస్ హయాంలో అత్యంత ఘోరమైన ఫోన్ ట్యాపింగ్ నేరం చేశారని.. ఉగ్రవాదుల మీద తప్ప, ఇతరుల ఫోన్లు ట్యాప్ చేయొద్దని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రముఖుల సంసారాల్లో తొంగి చూశారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయని.. విచారణకు రమ్మంటే ర్యాలీలు ఎందుకని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్.