చల్లంగా చూడయ్యా.. విఘ్ననాయకా..బాలాపూర్లో పీసీసీ చీఫ్ పూజలు

చల్లంగా చూడయ్యా.. విఘ్ననాయకా..బాలాపూర్లో పీసీసీ చీఫ్ పూజలు

వికారాబాద్ , వెలుగు: మర్పల్లిలో పలు వినాయక మండపాలను స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ సందర్శించి పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. 

బాలాపూర్​లో పీసీసీ చీఫ్​ పూజలు

ఎల్బీనగర్: బాలాపూర్ గణనాథుడిని  పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ గౌడ్ బుధవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమంలో బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాథ్​రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి పాల్గొన్నారు.

జేఎన్​టీయూలో అద్దంకి..

కూకట్​పల్లి: జేఎన్​టీయూ క్యాంపస్​లో స్టూడెంట్స్​ ప్రొటెక్షన్​ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్​ సతీసమేతంగా హాజరయ్యారు. అంతకుముందు గణనాథుడికి పూజలు చేశారు.