అందుకే పవన్ను మేం దిష్టి కల్యాణ్ అంటాం: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

అందుకే పవన్ను మేం దిష్టి కల్యాణ్ అంటాం: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పవన్ ఆంధ్రాలో రాజకీయం చేసుకోవాలని.. తెలంగాణలో కాదని అన్నారు. ఆయనను తెలంగాణ ప్రజలు ఆదరించరని అన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, భాష, సంస్కృతి గురించి దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. అందుకే పవన్ ను దిష్టి కల్యాణ్ అని అంటామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటున్నారుని.. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సంక్షేమం, అభివృద్ధి ఇస్తుందని అన్నారు. అందుకే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతానికిపైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ఆ భయంతో పవన్ కల్యాణ్ లాంటి సినీ తారలను బీజేపీ నాయకులు అడుక్కునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. ఆంధ్రాలో రాజకీయాలు చేసుకుంటే మంచిదని పీసీసీ చీఫ్ సూచించారు.