ఇచ్చేదే గుప్పెడు మందికి.. అందులోనూ కమీషన్లా..?

ఇచ్చేదే గుప్పెడు మందికి.. అందులోనూ కమీషన్లా..?

హైదరాబాద్: రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ నేతలు, వారి అనుచరుల ఆగడాలు, వ్యవహార శైలిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. దళిత బంధు పథకం లబ్దిదారుల ఎంపిక ప్రారంభం కాకముందే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనుచరుల బేరసారాలు.. మంత్రులు, పార్టీ నేతల ఇళ్ల ముందు దళిత నేతల ఆందోళనలు జరుగుతున్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలను ట్యాగ్ చేస్తూ.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరుల ఆగడాలను ప్రస్తావించారు. 

‘సబ్ ప్లాన్ కు మంగళం పాడారు.. మూడెకరాలిస్తామని మొండి చేయి చూపారు.. దళితబంధు ఇచ్చేదే గుప్పెడు మందికి.. శవాలను పీక్కుతినే రాబందుల్లా అందులోనూ గులాబీ ముఠాకు కమీషన్లా..? సిగ్గు సిగ్గు.. ’ అంటూ ట్వీట్ చేశారు.