సీపీ అంజనీకుమార్ పై ఉత్తమ్ సీరియస్

సీపీ అంజనీకుమార్ పై ఉత్తమ్ సీరియస్

హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన క్యారెక్టర్ లెస్ ఫెల్లో, దిగజారిన వ్యక్తి, అవినీతి పరుడంటూ మండిపడ్డారు. అతనికి పోలీస్ కమిషనర్ గా ఉండే అర్హత లేదన్నారు. గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షకు వచ్చే వారిని ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు ఉత్తమ్. అసలు గాంధీభవన్ దగ్గర పోలీసులకు ఏం పని అంటూ నిలదీశారు. సీపీ అంజనీకుమార్ సంగతి చూస్తామని హెచ్చరించారు. అంజనీకుమార్ TRS, KCRకు తొత్తుగా మారాడని ఆరోపించారు. అంజనీకుమార్‌ కల్వకుంట్ల పోలీస్ సర్వీస్.. కేపీఎస్ అని పెట్టుకోవాలన్నారు. అంజనీకుమార్ ఐపీఎస్‌కు అనర్హుడని, సీపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓవర్ యాక్షన్ చేసే పోలీసుల అంతు చూస్తామని ఆయన హెచ్చరించారు. సీపీ చిట్టా తీసి గవర్నర్‌కు సమర్పిస్తామని చెప్పారు. గవర్నర్ ఆపాయింట్ మెంట్ కోరానని.. సోమవారం రోజు కలుస్తానని చెప్పారు ఉత్తమ్.

అంతేకాదు మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి.