హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల మానిటరింగ్ కోసం పీసీసీ కమిటీని నియమించింది. పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మానిటరింగ్ కమిటీని నియమిస్తూ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ కమిటీకి కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, మరో 14 మందిని సభ్యులుగా నియమించారు. మీడియా కో ఆర్డినేషన్ కమిటీని కూడా పీసీసీ నియమించింది. చైర్మన్ గా రామ్మోహన్, మరో 14 మందిని సభ్యులుగా అపాయింట్ చేసింది.
