నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్.. టాస్క్ ఫోర్స్ దాడులకు సిద్ధంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్.. టాస్క్ ఫోర్స్ దాడులకు సిద్ధంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం (మే 16) వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం  రేవంత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. వానకాలం పంటలకు సన్నద్ధమవ్వాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని చెప్పారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని,  కల్తీ విత్తనాల వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని ఆదేశించారు. సరిహద్దుల్లో విత్తన రవాణాపై నిఘా పెంచాలని.. రాష్ట్రవ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించారు.  

►ALSO READ | కాళేశ్వరం విచారణ కంప్లీట్.. కేసీఆర్‎ను పిల్వరు.. హరీశ్, ఈటలతో మాట్లాడరు..!