పెద్దపల్లి, వెలుగు: లేబర్పోర్టల్లో లోపాలు సరిచేసి అర్హులందరికీ లేబర్కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్వెంకటస్వామిని పెద్దపల్లి కాంగ్రెస్ లీడర్లు కోరారు. బుధవారం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. లేబర్ వెబ్ పోర్టల్ లోపాల వల్ల లేబర్ కార్డులకు సంబంధించి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిలో తెలిపారు.
ఫొటోగ్రఫీ వృత్తిలో ఉన్నవారు, ఎల్‌ఈడీ స్క్రీన్ ఆపరేటర్లు, లైటింగ్ విభాగం కార్మికులు సహా అనేకమంది సినీ, ఇతర రంగాల కార్మికులకు ఇప్పటికీ లేబర్ కార్డులు లేవని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే లేబర్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలను సరిచేసి డేటా భద్రత కల్పించడంతో పాటు అర్హులైన వారందరికీ లేబర్ కార్డులు అందించాలని కాంగ్రెస్ నేత అల్లం సతీశ్.. మంత్రిని కోరారు.

