బాల్క సుమన్‌‌‌‌‌‌‌‌ ను కఠినంగా శిక్షించాలి : కార్యదర్శి గడ్డం సతీశ్‌‌‌‌‌‌‌‌

బాల్క సుమన్‌‌‌‌‌‌‌‌ ను కఠినంగా శిక్షించాలి : కార్యదర్శి గడ్డం సతీశ్‌‌‌‌‌‌‌‌
  •     దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా కార్యదర్శి గడ్డం సతీశ్‌‌‌‌‌‌‌‌ 

పెద్దపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతన్‌‌‌‌‌‌‌‌పల్లిలో మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్ లపై దాడికి పాల్పడిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్క సుమన్, అతని అనుచరులను కఠినంగా శిక్షించాలని దళిత సామాజిక హక్కుల పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్​కుమార్​బుధవారం డిమాండ్​ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ ఎన్నిక సందర్భంగా మున్సిపల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు వస్తున్న మంత్రి, ఎంపీ కాన్వాయ్‌‌‌‌‌‌‌‌పై దాడి చేయడం దారుణమన్నారు. బాధ్యతాయుతమైన పార్టీ నేతగా హుందాగా వ్యవహరించాల్సిన బాల్క సుమన్ రౌడీలాగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన ఆరోపించారు. పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.