కోల్‌బెల్ట్, వెలుగు: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. శనివారం సాయంత్రం పొద్దుపోయాక మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొంది హైదరాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ గాండ్ల సమ్మయ్యను, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆర్కే4 గడ్డ ప్రాంతానికి చెందిన కార్యకర్త రామగిరి శ్రీనివాస్‌ను ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు.
వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్‌నగర్‌కు చెందిన ఐఎన్టీయూసీ సీనియర్లీడర్ తేజావత్రాంబాబు ఇటీవల అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఎంపీ వెంట డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డి, టౌన్ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్, మాజీ ప్రెసిడెంట్పల్లె రాజు, సీనియర్ లీడర్లు సదానందంయాదవ్, యాకుబ్‌అలీ, కౌన్సిలర్లు, లీడర్లు పాల్గొన్నారు.
