యువత సాధించిన విజయం : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎంపీ వంశీ కృష్ణ

యువత సాధించిన విజయం : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎంపీ వంశీ కృష్ణ

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై పెద్దపల్లి ఎంపీ  గడ్డం వంశీకృష్ణ  స్పందించారు. ఇది యువత సాధించిన విజయం అన్నారు.  గత నెలరోజులు యువత పట్ట బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అహంకారానికి నిదర్శనం అన్నారు  నెలరోజులుగా విద్యార్థులు, యువత ఢిల్లీలోని జంతర్ మంతర్ లో తమ హక్కుకోసం కొట్లాడి విజయం సాధించారని కొనియాడారు ధర్మేంద్ర  ప్రధాన్ రాజీనామాతో యువత పోరాటానికి ఫలితం లభించిందన్నారు గడ్డం వంశీకృష్ణ. ఈ పోరాటంతో దేశమంతా ఒక్కటే.. తమ హక్కుల కోసం తాము ఎన్ను్కున్న  ప్రభుత్వం మెడలు వంచి తమ హక్కును సాధించుకున్నారని నిరూపించరని అన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. యువత తలచుకుంటే  ఏదైనా సాధిస్తారని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో రుజువైందన్నారు. 

ఇదిలా ఉంటే శనివారం (జూలై 25) నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఇంటర్నెట్ లో పెట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో విద్యార్థులు, యువత సంబురాలు చేసుకున్నారు. గత నెల రోజులుగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనియువత  ఉద్యమం  చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల పోరాటం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది.  చివరగా ధర్మేంద్ర  ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.