పెద్దపల్లి ఎంపీ, విశాక జేఎండి గడ్డం వంశీకి.. ప్రతిష్ఠాత్మకమైన BW డిస్రప్ట్ నేషనల్ అవార్డ్

పెద్దపల్లి ఎంపీ, విశాక జేఎండి గడ్డం వంశీకి.. ప్రతిష్ఠాత్మకమైన  BW  డిస్రప్ట్ నేషనల్  అవార్డ్

పెద్దపల్లి ఎంపీ, విశాక జేఎండి గడ్డం వంశీకి ప్రతిష్ఠాత్మకమైన బీడబ్ల్యూ డిస్రప్ట్ నేషనల్ అవార్డు దక్కింది.  40 ఏండ్లలోపు సక్సెస్ ఫుల్ వ్యాపార వేత్తగా  వంశీకి  ఈ అవార్డు  వచ్చింది. సెప్టెంబర్ 6న  ఢిల్లీలోని రాడిసన్ హోటల్ లో బీడబ్ల్యూ డిస్ రస్ట్ ఫౌండర్స్ ఫోరం - 2024 అట్టహాసంగా జరిగింది.  ఫోరం ఆఫ్ ఇండియాస్ టాప్ ఫౌండర్స్ పేరుతో  బిడబ్ల్యూ డిస్ రప్ట్ 8 ఎడిషన్  నిర్వహించారు. ఇందులో భాగంగా 40 అండర్ 40  పేరుతో అంటే.. 40 ఏండ్లలోపు సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తలను  సత్కరించించింది సంస్థ. ఈ ఎడిషన్ లో గడ్డం వంశీకి  నేషనల్ అవార్డు వచ్చింది.  

ఎంపీ  వంశీకృష్ణ  విశాక ఇండస్ట్రీస్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. నాణ్యమైన ఏసీ షీట్స్, ఫైబర్ సిమెంట్ బోర్డులను అందిస్తూ విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ  ప్రజల విశ్వాసాన్ని పొందిన  కంపెనీగా పేరుపొందింది. ఎంపీ వంశీకి బదులు  విశాఖ ఢిల్లీ బ్రాంచ్ జనరల్ మేనేజర్ ముకేష్ సిసోడియా, ఏజీఎం రాజ్ హన్స్ ఈ అవార్డు అందుకున్నారు.

ALSO READ | సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఎంపీ గడ్డం వంశీ

దేశంలో విశాక ఇండస్ట్రీస్ కంపెనీ తయారు చేసే వస్తువులపై ప్రజల్లో‌ నమ్మకం, బలమైన విశ్వాసం ఉందన్నారు విశాక ఇండస్ట్రీస్ ఢిల్లీ బ్రాంచ్ మేనేజర్ ముకేష్ సిసోడియా. జేఎండి వంశీ సారధ్యం తమ  కంపెనీ  దేశంలో టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. అనునిత్యం సంస్థ ఎదుగుదలతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన ఏసీ షీట్స్, ఫైబర్ సిమెంట్ బోర్డులను అందించాలనేదే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల ప్రాడక్ట్ లు అందుబాటులో ఉన్నా విశాఖ కంపెనీకి మంచి పేరుందన్నారు.