ఫోన్ ట్యాపింగ్ కొత్తేం కాదు

ఫోన్ ట్యాపింగ్ కొత్తేం కాదు

బెంగళూరు: పెగాసస్ స్పైవేర్ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు కేంద్ర మంత్రులతోపాటు ప్రతిపక్ష నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు హ్యాక్ అవ్వడం సంచలనంగా మారింది. ఈ విషయంపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి స్పందించారు. ఇలాంటి హ్యాకింగ్ ఘటనలు గతంలోనూ జరిగాయని కుమారస్వామి అన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు 10 నుంచి 15 ఏళ్లలో ఇలాంటి పలు ఘటనలు జరిగాయన్నారు. 

గత ప్రభుత్వాల హయాంలో కూడా కొందరి ఫోన్లను ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ అధికారులతో ట్యాప్ చేయించాయని కుమారస్వామి పేర్కొన్నారు. 'నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నా పర్సనల్ సెక్రెటరీ ఫోన్ ట్యాపింగ్ కు గురైంది. నా దృష్టిలో ఇలాంటి ఘటనలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కరోనా వల్ల ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆపదలో ఉన్న సామాన్య జనాలను ఆదుకోవడంపై నేతలు దృష్టి సారించాలి' అని కుమారస్వామి సూచించారు.