మూసీకి పూర్వవైభవం తీస్కురావాలి

మూసీకి పూర్వవైభవం తీస్కురావాలి
  • డీహెచ్​ఏటీ చైర్మన్​ మణికొండ వేదకుమార్
  • చరిత్రను గుర్తుచేస్తూ 60 మందితో నది వెంబడి నడక

హైదరాబాద్, వెలుగు : మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని దక్కన్​హెరిటేజ్​అకాడమీ ట్రస్ట్​చైర్మన్ మణికొండ వేదకుమార్ పిలుపునిచ్చారు. మూసీ నది ప్రాముఖ్యత, చరిత్ర, పూర్వవైభవాన్ని తీసుకురావాల్సిన అవశ్యకతను వివరిస్తూ శనివారం ఐకోమోస్ ఇండియా ఆధ్వర్యంలో మూసీ నది వెంట రివర్ అండ్ హెరిటేజ్ ఇంటర్ ఫేస్ వాక్ నిర్వహించారు. వేదకుమార్ నేతృత్వంలో 60 మంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వరకు నడిచారు.

1908లో వరదలొచ్చినప్పటి పరిస్థితులను వేదకుమార్​వివరించారు. ఐకోమోస్ ఇండియా కార్యదర్శి నితిన్ సిన్హా, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హైదర్, డాక్టర్ వసంత శోభ, ఇందిరా కొల్లి, జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రగతి, బిందు భార్గవి, ఖైజర్, రఘు, ఇబ్రహీం, పౌరసమాజం తదితరులు పాల్గొన్నారు.