ప్రజాస్వామ్య రక్షణకు కాంగ్రెస్​కే ఓటెయ్యాలి : కోదండరాం

ప్రజాస్వామ్య రక్షణకు కాంగ్రెస్​కే ఓటెయ్యాలి : కోదండరాం

 

  • బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది
  • జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం

చౌటుప్పల్ వెలుగు: దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజలందరూ కాంగ్రెస్ కే ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్​కోదండరాం పిలుపునిచ్చారు. శనివారం  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో టీజేఎస్​పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్​రూ. 40 వేల కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్లకు పెంచి  కాంట్రాక్టర్లను పెంచి పోషించాడన్నారు.

బీఆర్ఎస్​ప్రభుత్వ హయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి అణచివేశారని, ఇప్పుడేమో హరీశ్​ రావు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారన్నారు. దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి నిరంకుశ పాలనకు తెరలేపుతుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, పేద ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరాడు. జిల్లా అధ్యక్షుడు దేశపాక శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేశ్, పల్లవి, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డి, రతన్ రావు, సత్యనారాయణ, జిల్లా యువజన అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.