పెగట్రాన్ రెండో ప్లాంట్‌లో ఐఫోన్‌‌‌‌ల అసెంబుల్

పెగట్రాన్ రెండో ప్లాంట్‌లో ఐఫోన్‌‌‌‌ల అసెంబుల్

న్యూఢిల్లీ: యాపిల్‌‌‌‌ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌‌‌‌‌‌‌‌ పెగట్రాన్ ఇండియాలో తమ రెండో  మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది.  ఈ ప్లాంట్‌‌‌‌ను కూడా చెన్నైకి దగ్గరలోనే ఏర్పాటు చేయనున్నట్టు సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. తమ మొదటి ప్లాంట్‌‌‌‌ కోసం పెగట్రాన్‌‌‌‌ 150 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. మొదటి ప్లాంట్‌‌‌‌ను ఓపెన్ చేసిన ఆరు నెలల్లోనే  రెండో ప్లాంట్‌‌‌‌కు సంబంధించిన వార్తలొస్తున్నాయి.

లేటెస్ట్ ఐఫోన్‌‌‌‌లను ఈ కొత్త ఫ్యాక్టరీలో అసెంబుల్ చేస్తారు.  యాపిల్ తన ప్రొడక్షన్‌‌‌‌ను చైనా నుంచి వివిధ దేశాలకు షిఫ్ట్ చేస్తోంది. దీంతో కంపెనీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లు ఇండియా, ఫిల్లిఫ్పీన్స్‌‌‌‌ వంటి దేశాల వైపు చూస్తున్నారు. దేశంలో ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌, పెగట్రాన్‌‌‌‌లు ఇప్పటికే తమ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. గ్లోబల్‌‌‌‌గా తయారవుతున్న ఐఫోన్‌‌‌‌లలో 10 శాతం మన దగ్గరే తయారవుతున్నాయి.