ఆర్పీలకు పెండింగ్ శాలరీలు ఇవ్వాలి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్

ఆర్పీలకు పెండింగ్ శాలరీలు ఇవ్వాలి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న 6 వేల మంది రిసోర్స్ పర్సన్స్(ఆర్ పీ)లకు ఆరు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. అందరికీ ఒకే డ్రెస్ కోడ్ ఇవ్వాలని, రూ.26 వేలకు జీతం పెంచాలని కోరారు. తెలంగాణ మెప్మా ఆర్పీ రిసోర్స్ పర్సన్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఎస్వీ రమ అధ్యక్షతన గురువారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. ఆర్పీలకు జీవో 4 ప్రకారం జీతాలు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని కోరారు.