అల్వాల్, వెలుగు : యుద్ధప్రాతిపదికన ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ సోమవారం అల్వాల్ సర్కిల్ లోని మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ కొత్త చెరువు, చిన్నరాయుని చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కతో దోమల బెడద ఎక్కువైందన్నారు. అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మూడు డివిజన్ల అధ్యక్షులు అజయ్ రెడ్డి, కార్తీక్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, బీజేపీ నాయకులు దండుగుల వెంకటేశ్, శేఖర్, నిమ్మ కృష్ణారెడ్డి, మురళీకృష్ణ, లక్ష్మణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
