చంద్రబాబు ఇంటిని హోమ్ టూర్ చేద్దాం.. పేర్ని నాని

చంద్రబాబు ఇంటిని హోమ్ టూర్ చేద్దాం.. పేర్ని నాని

ఏపీలో గత ప్రభుత్వం రిషికొండపై కట్టిన భవనాల గురించి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ తన నివాసం కోసం 500కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ భవనాలు నిర్మించారని కూటమి శ్రేణులు ఆరోపిస్తుండగా, ఆ భవనాలు రాష్ట్రపతి, ప్రధాని వంటి విశిష్ట అతిధులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆతిధ్యం ఇవ్వటం కోసం కట్టిన భవనాలని, ప్రభుత్వ వినియోగం కోసం మాత్రమే ఉద్దేశించి కట్టిన భవనాలని వైసీపీ అంటోంది. ఈ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అధికార పక్షానికి కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు ఇంటిని మీడియాని తీసుకెళ్లి హోమ్ టూర్ చేయించాలని, జగన్ ఇంటిని కూడా హోమ్ టూర్ చేయించి రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి తప్పు ఎవరిదో తేల్చాలని అన్నారు. జగన్ కట్టింది ప్యాలెస్ అయితే, హైదరాబాద్ లో చంద్రబాబు నివసించేది రాజమహల్ అందామా అని ప్రశ్నించారు. ఫర్నిచర్ విషయంలో కూడా అనవసరంగా జగన్ పై బురద చల్లుతున్నారని, వాటి విలువ ఎంతో చెబితే తక్షణమే చెల్లిస్తామని లేదా ప్రభుత్వానికి అప్పచెప్పటానికి కూడా రెడీ అని అన్నారు పేర్ని నాని.