ప్రణీత్‌‌రావును మరోసారి విచారించాలి..హైకోర్టులో పిటిషన్

ప్రణీత్‌‌రావును మరోసారి విచారించాలి..హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో అరెస్టయిన అడిషనల్‌‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌ రావులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో మంగళవారం పిటిషన్  దాఖలు చేశారు. నిందితులను ప్రశ్నించేందుకు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌లో కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసు కస్టడీ అవసరమని పేర్కొన్నారు.

వారి పిటిషన్‌‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్  దాఖలు చేయాలని నిందితుల తరపు న్యాయవాదులను ఆదేశించింది. ఆధారాలను సమర్పిం చేందుకు డిఫెన్స్‌‌  లాయర్లు రెండు రోజుల గడు వు కావాలని కోరారు. కానీ, బుధవారం కౌంటర్‌‌  పిటిషన్‌‌  దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక పోలీసులు కోరిన కస్టడీ పిటిషన్‌‌పై తీర్పును బుధవారం వెల్లడించనుంది.