రెచ్చిపోతున్న పెట్రోల్ దొంగలు

రెచ్చిపోతున్న పెట్రోల్ దొంగలు

వరంగల్ నగరంలో పెట్రోల్ దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి ఇండ్ల ముందు పార్క్ చేసి ఉన్న బైకుల నుండి ఆయిల్ పైపులు కోసి పెట్రోల్ ఎత్తుకెళ్తున్నారు. తాజాగా నగరంలోని 32 వ డివిజన్ బండి వారి వీధి ప్రాంతంలో పలు బైకుల నుండి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ దొంగతనం చేస్తున్న ఘటన సీసీ కెమెరాలకు చిక్కింది.

గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని బాధితులు వాపోతున్నారు. పోలీసుల పెట్రోలింగ్ సరిగా లేని ప్రదేశాల్లో పెట్రోల్ దొంగలు బరితెగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర వాసులు కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులు పెట్రోల్ దొంగలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.