టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీజీ ఈసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -2024

టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీజీ ఈసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -2024

తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పీజీఈసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)-2024 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రిలీజ్​ చేసింది. ఎగ్జామ్​ జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నిర్వహించనుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళాశాలల్లో ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైం ఎంఈ, ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. డి కోర్సుల్లో ఈ నోటిఫికేషన్​తో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సులు: ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైం ఎంఈ, ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.డి కోర్సుల్లో అడ్మిషన్స్​ కల్పిస్తారు.

విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, జియో-ఇంజినీరింగ్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జియో-ఇన్ఫర్మాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, ఫార్మసీ, టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ టెక్నాలజీ.

అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్​లైన్​లో ద్వారా మే 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు  రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600) చెల్లించాలి.

సెలెక్షన్​: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జూన్​ 6 నుంచి జూన్​ 9 వరకు 19 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.pgecet.tsche.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.