అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ అడ్మిషన్స్

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ అడ్మిషన్స్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హత పరీక్ష కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఏవీఆర్ఎన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే నెల 20న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుందని గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

ఇంగ్లిష్, హిందీ, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంటల్ సైన్స్‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో  పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ అడ్మిషన్లకు అర్హులైన వారు అప్లై చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు మే 8న చివరి తేదీ అని చెప్పారు.

వర్సిటీ వెబ్ సైట్  www.braouonline.in ద్వారా  దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు రూ.1,000, ఇతరులు రూ.1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని  పేర్కొన్నారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ హైదరాబాద్​లో జరుగుతుందని, వివరాల కోసం1800 599 0101 నంబర్​ను సంప్రదించాలని ఏవీఆర్ఎన్ రెడ్డి సూచించారు.