కాంగ్రెస్ పార్టీకి.. ఫోన్ పే వార్నింగ్.. అలా ఎలా వాడేసుకుంటారు?

కాంగ్రెస్ పార్టీకి..  ఫోన్ పే వార్నింగ్..  అలా ఎలా వాడేసుకుంటారు?

ఫోన్​పే కంపెనీ బ్రాండింగ్​ని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్​ పార్టీ వాడుకోవాలని చూస్తోందని ఫోన్​ పే యాజమాన్యం ఆరోపించింది. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ పార్టీని హెచ్చరించింది. మధ్యప్రదేశ్​లోని సీఎం శివరాజ్​సింగ్​ చౌహాన్​ ప్రభుత్వమే టార్గెట్​గా కాంగ్రెస్​ పార్టీ వినూత్నంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఫోన్​పై సింబల్​పై సీఎం ఫొటోను ముద్రించి..  దాని కింద'50  %  లావో.. కమ్​ కరావో '(50 శాతం తీసుకురండి.. పని పూర్తి చేయండి) అనే మెసేజ్​తో కూడిన క్యూఆర్​కోడ్​ఉంది. 

రాష్ట్రంలో ఏదైనా  పని అమలు చేయడానికి దానికి బదులుగా డబ్బు అడుగుతూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ రాజధాని భోపాల్ అంతటా ఆ పార్టీ పోస్టర్లు వేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్​ పార్టీ మాజీ సీఎం బసవరాజ్​ బొమ్మై ని లక్ష్యంగా చేసుకుని 'పే సీఎం' పేరుతో పోస్టర్​ ప్రచారాన్ని చేశారు.  ఇలాంటి ప్రచారం నిర్వహించడాన్ని ఫోన్​ పే సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ కంపెనీ లోగోను ఉపయోగించడంపై చట్టపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించింది. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ట్విటర్​లో వివరించింది.