ట్రావెల్ పేమెంట్స్‌‌ కోసం.. ఫోన్ పే రూపే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిగో కార్డ్‌‌

 ట్రావెల్ పేమెంట్స్‌‌ కోసం.. ఫోన్ పే  రూపే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిగో కార్డ్‌‌

న్యూఢిల్లీ: ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు పేమెంట్ అగ్రిగేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పే ‘రూపే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిగో’ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది. మెట్రో, బస్సులు, రైళ్లు, టోల్, పార్కింగ్  దగ్గర  కార్డును ట్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి పే చేయొచ్చు.   నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎంసీ) లో భాగంగా ఫోన్ పే దీనిని తీసుకొచ్చింది. మొదట హైదరాబాద్ మెట్రోతో  టై అప్ అయ్యింది. యూజర్లు  ఫోన్  పే కార్డును హైదరాబాద్ మెట్రో టికెట్ కౌంటర్ దగ్గర కొనుక్కోవచ్చు. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత వెంటనే కార్డ్ ఇస్తారు. ఇది ప్రీపెయిడ్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తుంది. యూజర్లు కార్డును రూ.2 వేల వరకు రీచార్జ్  చేసుకోవచ్చు. ఒక్కో ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ట్రాన్సాక్షన్ కోసం గరిష్టంగా రూ.500 మాత్రమే వాడుకోవడానికి వీలుంటుంది.   ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఈ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కంపెనీ విస్తరించనుంది.