
వెలుగు, పద్మారావునగర్: గాంధీ హాస్పిటల్లో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత నెల 10న పనులు మొదలవగా, రూ.15.5కోట్ల టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాడు. వారం కింద కొత్త డ్రైనేజీ పైప్లైన్ కోసం హాస్పిటల్లోని సీసీ రోడ్డును తవ్వి వదిలేశాడు. పేషెంట్లు, అంబులెన్సుల రాకపోకలకు ఇబ్బంది అవుతోంది.