ఇవాళ్టి(అక్టోబర్ 11) నుంచి హైదరాబాద్‌‌‌‌లో పికిల్‌‌‌‌బాల్‌‌‌‌ టోర్నీ

ఇవాళ్టి(అక్టోబర్ 11) నుంచి హైదరాబాద్‌‌‌‌లో పికిల్‌‌‌‌బాల్‌‌‌‌ టోర్నీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్ పికిల్‌‌‌‌బాల్ అసోసియేషన్ (హెచ్‌‌‌‌పీఏ) ఆధ్వర్యంలో శనివారం సిటీలో పికిల్‌‌‌‌బాల్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌ ఆరంభం కానుంది.  కొండాపూర్‌‌‌‌‌‌‌‌లోని ప్యాడిల్‌‌‌‌వేవ్‌‌‌‌ స్పోర్ట్స్ ఎరీనా వేదికగా రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో సుమారు 200 మంది ప్లేయర్లు పాల్గొంటారని హైదరాబాద్ పికల్‌‌‌‌బాల్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్ దుద్దిళ్ల శ్రీనివాస్‌‌‌‌ బాబు తెలిపారు. విన్నర్లకు రూ.1.5 లక్షల ప్రైజ్‌‌‌‌మనీ అందిస్తున్నట్లు తెలిపారు.  రౌండ్‌‌‌‌ రాబిన్, నాకౌట్ ఫార్మాట్‌‌‌‌లో ఓపెన్ కేటగిరీలో విమెన్స్‌‌‌‌, మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌తో పాటు మిక్స్‌‌‌‌డ్ డబుల్స్‌‌‌‌ విభాగాల్లో పోటీలు ఉంటాయని వెల్లడించారు.