హైదరాబాద్, వెలుగు: కిరాణా దుకాణాలు, చిన్న హోటళ్లు, ఫ్రీలాన్సర్ల కోసం రూపొందించిన వాయిస్ ఆధారిత బిల్లింగ్, అకౌంటింగ్ ఏఐ ఏజెంట్ ‘పిల్లొ ఏఐ’ యాప్ అందుబాటులోకి వచ్చింది. తెలుగులో మాట్లాడటం ద్వారా బిల్లులు, లావాదేవీలు నిర్వహించే ఈ యాప్, సమయం, శ్రమను ఆదా చేస్తుంది.
సాంకేతికతతో వ్యాపార ప్రక్రియలను సులభతరం చేస్తూ, డిజిటల్ వృద్ధిని బలోపేతం చేయడమే దీని లక్ష్యం. రోజువారీ లావాదేవీలను నమోదు చేయడం, ఖాతాలను సరిచూసుకోవడం, నివేదికలు పొందడం వంటి పనులను కేవలం వాయిస్ కమాండ్స్ ద్వారా పూర్తి
చేయవచ్చు
