కరకగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో వట్టం వారి గుంపు గ్రామపంచాయతీలోని ఆశ్రమ హై స్కూల్ ను శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థులకు అందజేస్తున్న భోజనం నాణ్యత, వసతి సౌకర్యాలు పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించారు.
