హైదరాబాద్, వెలుగు: నిఫ్టీ వచ్చే డిసెంబర్ నాటికి 27,958 పాయింట్ల స్థాయికి చేరుతుందని ప్రభుదాస్ లీలాధర్(పీఎల్) క్యాపిటల్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. దీని రిపోర్ట్ ప్రకారం.. మౌలిక సదుపాయాలు, తయారీ, డిజిటల్ పెట్టుబడులు వృద్ధికి దోహదపడుతున్నాయి. 2026, 2028 ఆర్థిక సంవత్సరాల మధ్య కార్పొరేట్ లాభాలు 16.3 శాతం వార్షిక వృద్ధితో పెరుగుతాయి.
ఈయూ తో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, రసాయనాల రంగాలకు మేలు జరుగుతుంది. బడ్జెట్‌లో కేటాయింపులు తయారీ రంగానికి ఊతమిస్తున్నాయి. బ్యాంకింగ్, వాహన, ఆరోగ్య రంగాలపై సానుకూల ధోరణి ఉంది. ప్రస్తుతం ఒడిదుడుకులు ఉన్నా, దీర్ఘకాలంలో మార్కెట్ పెరుగుతుందని రిపోర్టు వివరించింది.
