TSPSC Paper Leak: చిన్నోళ్లను అరెస్టు చేసి కేసు క్లోజ్ చేసే ప్లాన్ చేస్తున్రు: బండి సంజయ్

TSPSC Paper Leak: చిన్నోళ్లను అరెస్టు చేసి కేసు క్లోజ్ చేసే ప్లాన్ చేస్తున్రు: బండి సంజయ్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ కేసులో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ఆయన.. ఈ కేసులో తన కొడుకు ఉన్నాడనే సీఎం కేసీఆర్ మాట్లాడడం లేదని ఆరోపించారు. బిడ్డ లిక్కర్ కేసుపైనా సీఎం కేసీఆర్ మాట్లాడడం లేదన్నారు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ ఎందుకు చేస్తలేరని బండి సంజయ్ నిలదీశారు. పేపర్ లీకేజీ వెనుక బీఆర్ఎస్ లీడర్ల హస్తం ఉందని విమర్శించారు.

ఏది జరిగినా సంబంధం లేదనడం మంత్రి కేటీఆర్ కు అలవాటేనని బండి సంజయ్ అన్నారు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగేది ఒక్క తెలంగాణలోనేనన్న ఆయన.. చిన్న వాళ్లను అరెస్ట్ చేసి కేసు క్లోజ్ చేయాలని చూస్తున్నారని, టీఎస్పీఎస్సీ కేసులో పెద్దమనుషుల హస్తం ఉందని ఆరోపించారు. నష్టపోయిన విద్యార్థులకు రూ.1లక్ష ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే భయమెందుకు అన్న ఆయన.. సీఎం కేసీఆర్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు.

https://youtu.be/TwD0wD6tW1Q