రూ.80 కోట్లతో ఎంఎంసీ బిల్డింగ్

రూ.80 కోట్లతో ఎంఎంసీ బిల్డింగ్
  • ఉప్పల్ భగాయత్​లో 10 ఎకరాల్లో నిర్మించాలని ప్లాన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: కొత్తగా ఏర్పడిన ఎంఎంసీ, సీఎంసీ ఆఫీసు బిల్డింగుల నిర్మాణం కోసం అధికారులు ప్లాన్​  చేస్తున్నారు. మల్కాజిగిరి కోసం ఉప్పల్ భగాయత్  లేఅవుట్​లోని 10 ఎకరాల్లో భారీ బిల్డింగ్​నిర్మించనున్నట్లు తెలిసింది.  రూ.80 కోట్ల అంచనాతో 5 ఫ్లోర్లలో ఈ బిల్డింగ్​నిర్మించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. ఇందులో కాంపౌండ్ వాల్ నిర్మాణానికే  దాదాపు 20 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు తెలిసింది.

అలాగే సీఎంసీ ఆఫీసును కైతలాపూర్ వద్ద ఐదెకరాల్లో  రూ.200 కోట్ల అంచనాతో 10 అంతస్తుల్లో నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పూర్తి స్థాయిలో బిల్డింగ్ ప్లాన్ రూపొందించి టెండర్లు వేయనున్నారు.