ప్లాస్టిక్ అండ్ రీ కన్ స్ట్రక్టివ్ లో .. మెడికవర్ హాస్పిటల్స్ దూకుడు

ప్లాస్టిక్ అండ్ రీ కన్ స్ట్రక్టివ్ లో  .. మెడికవర్ హాస్పిటల్స్ దూకుడు

మాదాపూర్​, వెలుగు: రెండేళ్లలో 2 వేలకు పైగా ప్లాస్టిక్​ అండ్​ రీ కన్​స్ర్టక్టివ్​ అపరేషన్లను మాదాపూర్​ మెడికవర్​ హాస్పిటల్స్​ విజయవంతంగా పూర్తిచేసిందని ప్లాస్టిక్​ సర్జన్​ డాక్టర్ రాజశేఖర్ మాదల తెలిపారు. మంగళవారం హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

 రెండేళ్లలో 2 వేలకు పైగా రోగులకు వారి రూపాన్ని మాత్రమే తిరిగి ఇవ్వకుండా, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, జీవన నాణ్యతను కూడా అందించగలిగామన్నారు. లేటెస్ట్​ టెక్నాలజీ, వ్యక్తిగత సంరక్షణ, శ్రద్ధతో కూడిన ఆఫ్టర్‌కేర్ ద్వారా ప్రతీ శస్త్రచికిత్సను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనరల్ సర్జన్ డాక్టర్ వెంకట్ పవన్, డాక్టర్ కౌశిక్, ట్రామా సర్జన్ డాక్టర్ దామోదర్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.