బంగారం, వెండిని మించిన ప్లాటినం క్రేజ్: ఏడాదిలో 110% పెరిగిన రేటు!

బంగారం, వెండిని మించిన ప్లాటినం క్రేజ్: ఏడాదిలో 110% పెరిగిన రేటు!

భారతీయులు దశాబ్ధాలుగా ఇష్టపడుతున్న బంగారం, వెండినే. ఆభరణాలు కొనాలన్నా, పూజా సామాగ్రి కావలన్నా ఈ లోహాలకే ఫస్ట్ చాయిస్. అయితే కొందరు ధనవంతులు మాత్రం బంగారం, వెండి కంటే ప్లాటినం జ్యూవెలరీ కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీంతో గడచిన ఏడాది కాలంలో ఊహించని స్థాయిలో ప్లాటినం ధరలు పెరుగుదలను చూశాయి. 

మే1, 2026లో గ్రాము రూ.2వేల 611 వద్ద ఉన్న ప్లాటినం రేటు మే 30, 2026 నాటికి రూ.5వేల 851కి చేరింది. అంటే ప్లాటినం రేటు 100 శాతం కంటే ఎక్కువగానే పెరిగింది. దీంతో ప్లాటినం జ్యూవెలరీ కొనేందుకు కూడా సంపన్నులు, మధ్యతరగతి వర్గాల నుంచి ఏస్థాయిలో డిమాండ్ ఉందనే విషయాన్ని ఈ ర్యాలీ కళ్లకు కడుతోంది. 

మార్చి 30న ప్లాటినం రేటు 10 గ్రాములకు రూ.58వేల 510 వద్ద కొనసాగుతోంది. అయితే దీని రేటు మార్చి 29 కంటే గ్రాముకు రూ.31 తగ్గుదలను నమోదు చేసింది. అందరూ బంగారం, వెండి వెనుక పడుతోంటే తెలివైన ఇన్వెస్టర్లు, సంపన్నులు మాత్రం సైలెంట్ గా ప్లాటినం ఆర్నమెంట్స్ కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు ప్లాటినం అంటే సంపన్నులకు మాత్రమే అన్నట్లుగా ఉండేది అయితే ప్రస్తుతం ప్లాటినం డైమెండ్ ఆర్నమెంట్స్ మార్కెట్ మెచ్యూ్ర్ అయ్యింది ప్రస్తుతం ఈ లోహానికి వచ్చిన ఆధరణ నిరూపిస్తోంది.