Kangana Ranaut: 'నీ అందాన్ని వాడుకో'.. గిరిజా ఓక్‌కు కంగనా రనౌత్ క్రేజీ సలహా!

Kangana Ranaut: 'నీ అందాన్ని వాడుకో'.. గిరిజా ఓక్‌కు కంగనా రనౌత్ క్రేజీ సలహా!

ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతారో ఊహించడం కష్టం. సరిగ్గా ఇలాగే రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది నటి గిరిజా ఓక్. ఒక పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో బ్లూ కలర్ శారీలో మెరిసిన ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. నెటిజన్లు ఆమెను ఏకంగా 'నేషనల్ క్రష్' అంటూ ట్రెండ్ చేశారు. అయితే, లేటెస్ట్ గా తన అప్‌కమింగ్ మూవీ 'భారత్ భాగ్య విధాత' ప్రమోషన్స్‌లో ఈ వైరల్ బ్యూటీ చేసిన కామెంట్స్..  దానికి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

నా అందం నా అచీవ్‌మెంట్ కాదు..

ఈ ఇంటర్వ్యూలో 'బ్లూ శారీ’ టాపిక్ రాగానే గిరిజా ఓక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా లుక్స్‌ను పొగుడుతూ ఆ వీడియోను విపరీతంగా షేర్ చేశారు. కానీ, ఇందులో నా కష్టం ఏముంది? ఇది నా జీన్స్  వల్ల వచ్చింది మాత్రమే. నా అందం నా అచీవ్‌మెంట్ కాదు అంటూ చాలా సింపుల్‌గా మాట్లాడింది. అంతేకాదు, కంగనాకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి కాబట్టి ఆమెను 'నేషనల్' అనడంలో ఒక లాజిక్ ఉంది. కానీ, తనకు 'నేషనల్ క్రష్' అనే ట్యాగ్ ఇవ్వడానికి ఎలాంటి సర్టిఫికెట్ లేదంటూ నవ్వేసింది.

కంగనా క్రేజీ రియాక్షన్..

గిరిజా మాటలకు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్  కంగనా రనౌత్ తనదైన స్టైల్లో ఫన్నీగా రియాక్ట్ అయింది.  'నువ్వు నా సినిమాలో నటించడం నాకు చాలా హ్యాపీ. ప్లీజ్.. నీకున్న ఈ క్రేజ్, అందాన్ని వాడుకుని మన సినిమాను కాస్త గట్టిగా ప్రమోట్ చెయ్' అంటూ కంగనా నవ్వేసింది. కంగనా వేసిన పంచ్‌కు అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు.

వైరల్ వెనుక ఉన్న చీకటి కోణం..

బయట ప్రపంచానికి ఈ వైరల్ ఫేమ్ పండగలా అనిపించినా.. దీని వెనుక ఉన్న డార్క్ సైడ్‌ను కూడా గిరిజా బయటపెట్టింది. ఈ క్రేజ్ వల్ల తనకు కొత్తగా సినిమా ఆఫర్లేమీ రాలేదని, పైగా సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు హద్దులు దాటి ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో  అసభ్యకరమైన మెసేజ్ లు పంపారు. నీతో ఒక గంట గడపడానికి రేట్ ఎంత? అంటూ దారుణంగా అడిగారని షాకింగ్ నిజాలు చెప్పింది. స్క్రీన్ వెనుక దాక్కుని ఇలాంటి వికృత చేష్టలు చేస్తారని..  అదే నిజ జీవితంలో ఎదురుపడితే కనీసం కళ్లు ఎత్తికూడా చూడలేరు అంటూ  గిరిజ ఆవేదన వ్యక్తం చేసింది.

మనోజ్ తపాడియా దర్శకత్వంలో కంగనా రనౌత్, గిరిజా ఓక్ ముఖ్య పాత్రల్లో వస్తున్న 'భారత్ భాగ్య విధాత' చిత్రం జూన్ 12న థియేటర్లలోకి రానుంది. మరి  కంగనాతో పాటు బ్లూ శారీ గర్ల్ గిరిజా ఓక్ కూడా స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.