ప్రధాని మోడీ విరాళాల మొత్తం రూ.103 కోట్లు!

ప్రధాని మోడీ విరాళాల మొత్తం రూ.103 కోట్లు!

న్యూఢిల్లీ: కరోనా క్రైసిస్ ను ఎదుర్కొనేందుకు గత మార్చిలో ప్రధాని మంత్రి కేర్స్ ఫండ్ (పీఎం కేర్స్)ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆపత్కాలంలో ప్రజలకు సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఫండ్ కు ప్రముఖులతోపాటు సాధారణ జనానీకం కూడా విరాళాలు అందజేశారు. పీఎం కేర్స్ ఫండ్ పై గురువారం ఆడిట్ నిర్వహించారు. ఈ వివరాలను శుక్రవారం బయటపెట్టారు. ఈ ఆడిట్ ద్వారా పీఎం కేర్స్ కు ప్రధాని మోడీ రూ.2.25 లక్షల సాయాన్ని అందించారని తెలిసింది. గత ఐదు రోజుల్లోనే ఈ ఫండ్ కు రూ.3,076 కోట్లు విరాళంగా రావడం గమనార్హం. అయితే ఈ అమౌంట్ కు మోడీ డొనేట్ చేసిన రూ.2.25 లక్షల ఇనీషియల్ కార్పస్ ఫండ్ తో సంబంధం లేదని తెలుస్తోంది. పీఎం కేర్స్ కు విరాళం అందజేసినందుకు ప్రధాని మోడీని పీయూష్ గోయల్, స్మృతి ఇరానీతో పాటు పలువరు సెంట్రల్ మినిస్టర్స్ మెచ్చుకున్నారు. ప్రజల అవసరార్థం మోడీ డొనేట్ చేయడం ఇది తొలిసారి కాదు.

బాలికల విద్యాభ్యాసానికి, క్లీన్ గంగా మిషన్ కు మోడీ ఆర్థిక సాయం అందజేశారు. పీఎం కేర్స్ కు అందజేసిన సాయంతోపాటు ఇప్పటివరకు చేసిన అన్ని డొనేషన్స్ ను కలుపుకంటే ప్రధాని మోడీ విరాళాల మొత్తం రూ.103 కోట్లు కావడం విశేషం. 2019లో కుంభమేలా శానిటైజేషన్ వర్కర్స్ వెల్ఫేర్ కోసం మోడీ రూ.21 లక్షలను ఇచ్చారు. రీసెంట్ గా తన మెమొంటోలను ఆక్షన్ కు పెట్టిన ప్రధాని.. తద్వారా వచ్చిన రూ.3.40 కోట్లను నేషనల్ క్లీన్ గంగా మిషన్ కు ఇవ్వనున్నారు. దీనికి అదనంగా 2015 నుంచి తాను అందుకున్న గిఫ్ట్ లను వేలంలో ఉంచడం ద్వారా వచ్చిన మరో రూ.8.35 కోట్లనూ నమామి గంగా మిషన్ కు డొనేట్ చేయనున్నారు. అలాగే గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అందుకున్నబహుమతులను ఆక్షన్ లో వేయగా వచ్చిన రూ. 89.96 కోట్లను కన్యా కేలావని ఫండ్ కు అందజేయడం విశేషం.