న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న విద్యా విధానానికి సాంకేతికతను జోడించి ముందుకు తీసుకెళ్లాలని చాలా మంది ప్రొఫెసర్లు, విద్యావేత్తలు చాన్నాళ్లుగా సూచిస్తున్నారు. ఈ దిశగా టెక్నాలజీ ఆధారిత విద్యను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం తొలి అడుగు వేసింది. పీఎం ఈ–విద్యా కార్యక్రమం కింద మల్టీ మోడ్ యాక్సెస్ తో డిజిటల్/ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ను వెంటనే ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. టాప్–100 యూనివర్సిటీలు ఈ నెల 30 నుంచి ఆన్ లైన్ కోర్సులను మొదలు పెట్టేలా అనుమతి ఇచ్చామని కేంద్రం వివరించింది.
Technology-driven education to be the focus- PM eVIDYa programme for multi-mode access to digital/online education to be launched immediately. Top 100 universities will be permitted to automatically start online courses by 30th May 2020: FM pic.twitter.com/1gVywcaSi6
— ANI (@ANI) May 17, 2020
