కొత్త మంత్రులను పరిచయం చేసిన మోడీ

కొత్త మంత్రులను పరిచయం చేసిన మోడీ

లోక్ సభలో కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని అడ్డుకున్నాయి ప్రతిపక్షాలు. కొత్తమంత్రులను సభకు పరిచయం చేసేందుకు ప్రధాని మోడీ లేవగా.....ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎంపీలు. వెల్ లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ... నిరసన తెలిపారు. అనేకమంది మహిళలు, దళితులు, OBCలు, రైతులు మంత్రులయ్యారని... వారిని చూసి అందరూ గర్విస్తారని తాను భావించానని మోడీ చెప్పారు. అయితే వెనకబడిన వర్గాలకు చెందినవారు మంత్రులు కావడం ప్రతిపక్షాలకు ఇష్టంలేనట్టుగా ఉందన్నారు. అందుకే పరిచయాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు.  విపక్షాలు నిరసన తెలపడంతో లోక్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

అంతకుమందు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణం చేశారు. లోక్ సభకు నలుగురు, రాజ్యసభకు ఒకరు కొత్తగా ఎన్నికయ్యారు. ఏపీలోని తిరుపతి నియోజకవర్గం నుంచి ఎన్నికైన గురుమూర్తి, కర్ణాటక ఎంపీ మంగల్ సురేష్ అంగడి, తమిళనాడుకు చెందిన విజయ్ కుమార్, కేరళకు చెందిన అబ్దుసమద్ సమదానీలు లోక్ సభలో ప్రమాణం చేశారు. ఇక రాజ్యసభలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ అబ్దుల్ వాహద్ ప్రమాణం చేశారు.